Last Updated:

Rinku-priya Wedding: రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్‌మెంట్‌.. సంచలన విషయాలు చెప్పిన తుఫాని సరోజ్

Rinku-priya Wedding: రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్‌మెంట్‌.. సంచలన విషయాలు చెప్పిన తుఫాని సరోజ్

Rumours of an engagement between Rinku Singh and MP Priya Saroj: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు అవుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన మచిలీ షహర్ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో తొలుత ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ పలు విషయాలు చెప్పాడు. ఆయన ప్రస్తుతం యూపీలోని కెరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి ప్రస్తావన గురించి రింకూ సింగ్ తండ్రితో అలీఘఢ్‌లో చర్చించనట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, ఈ సమావేశాలు ముగిసన అనంతరం పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వీరిద్దరికీ తోటి క్రికెటర్లు, అభిమానులు విషెస్ చెబుతున్నారు.

అయితే, రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లిపై వస్తున్న ప్రచారంపై ట్విస్ట్ నెలకొంది. వీరిద్దరికీ ఇంకా ఎంగేజ్ మెంట్ కాలేదని ఆమె తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, రింకూ సింగ్ కుటుంబం తమ పెద్ద అల్లుడితో పెళ్లి ప్రస్తావన గురించి చర్చించినట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి విషయంపై చర్చలు జరుగుతున్నాయని, కానీ రింకూ సింగ్, ప్రియా సరోజ్‌లకు ఎంగేజ్ మెంట్ జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్ ఇటీవల మచిలీ షహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆమె ఢిల్లీ వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసి సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. ఆమె తండ్రి 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. అలాగే రింకూ సింగ్.. జనవరి 22 నుంచి జరిగే టీ20 మ్యాచ్‌కు ఇంగ్లండ్ బయలుదేరనున్నారు. రింకూను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.