Last Updated:

Samsung Galaxy M35 5G Price Discount: న్యూ ఇయర్ ఆఫర్.. ఇంత తగ్గింపా.. సామ్‌సంగ్ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్..!

Samsung Galaxy M35 5G Price Discount: న్యూ ఇయర్ ఆఫర్.. ఇంత తగ్గింపా.. సామ్‌సంగ్ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్..!

Samsung Galaxy M35 5G Price Discount: కొత్త సంవత్సరం సంవత్సరం సందర్భంగా కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్ తక్కువగా ఉందా? ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇలాంటి అనేక డీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో షాపింగ్ చేయడం ద్వారా చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో Samsung Galaxy M35 5Gపై ఉన్న ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

6GB RAM+ 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 19,999, దీనిని ఇప్పుడు కేవలం రూ. 14,999కి కొనుగోలు చేయచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 5,000 ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీనిపై EMI ఆఫర్ కూడా ఇచ్చారు. కస్టమర్లు నెలవారీ EMI రూ. 727తో కొనుగోలు చేయవచ్చు. అయితే మీ వద్ద పాత ఫోన్ ఉండి, దాని కండిషన్ బాగుంటే రూ. 14,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్ పొందొచ్చు.

Samsung Galaxy M35 5G Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ M35 5జీ పనితీరు కోసం Samsung Exynos 1380 ప్రాసెసర్ ఉంది. 5nm ఆర్కిటెక్చర్ ఆధారిత చిప్‌సెట్ 8 GB RAM+ 256 GB స్టోరేజ్ ఆఫర్ చేస్తోంది. ఇది 6.62 అంగుళాల ఫుల్ HD + సూపర్ AMOLED డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తోంది.  పవర్ కోసం ఇది 25W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. మనం కెమెరాను చూస్తే వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం 13MP కెమెరా అందించారు. అదనంగా సామ్‌సంగ్ గెలాక్సీ M35 5G Samsung Wallet యాప్ ద్వారా ట్యాప్-అండ్-పేకు సపోర్ట్ ఇస్తుంది, వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది.