Last Updated:

OnePlus Ace 5 Pro: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. అతిపెద్ద బ్యాటరీ, అరగంటలో ఫుల్ ఛార్జింగ్..!

OnePlus Ace 5 Pro: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. అతిపెద్ద బ్యాటరీ, అరగంటలో ఫుల్ ఛార్జింగ్..!

OnePlus Ace 5 Pro: వన్‌ప్లస్ డిసెంబర్ 26న చైనాలో OnePlus Ace 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Ace 5, Ace 5 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉంటాయి. లాంచ్‌కు ముందు, కంపెనీ తన ఫీచర్లను క్రమంగా వెల్లడిస్తోంది. ఇప్పుడు కొత్త టీజర్‌లో, ప్రో మోడల్ AnTuTu స్కోర్‌ను కంపెనీ వెల్లడించింది, ఇది ఫోన్ పనితీరు పరంగా ఎలా ఉంటుందో చూపిస్తుంది. దీనితో పాటు మెయిన్ కెమెరా సెన్సార్, బ్యాటరీ సామర్థ్యం, ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి వివరాల గురించి కూడా కంపెనీ సమాచారం ఇచ్చింది. సిరీస్‌లోని OnePlus Ace 5 జనవరి 7న భారతదేశంలో OnePlus 13గా లాంచ్ అవుతుంది.

AnTuTu బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో OnePlus Ace 5 Pro 3.2 మిలియన్ల మార్కును అధిగమించిందని OnePlus చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో ఒక పోస్ట్‌ను పంచుకుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. ఇది సరైన పరిస్థితుల్లో 3 మిలియన్ల మార్క్‌ను దాటగలదు.

ఫోన్ 6100mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. ఇది 120FPS వద్ద గరిష్టంగా 7 గంటల గేమింగ్ సమయాన్ని అందించగలదు. అదనంగా డౌన్‌టైమ్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది, ఇది కేవలం 35 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ఫోటోగ్రఫీ గురించి మాట్లాడితే, OnePlus Ace 5 Proలో 50-మెగాపిక్సెల్ Sony IMX906 ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఇది గతంలో Realme GT7 Pro, Nubia Z70 Ultra వంటి స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించారు. ఇది Oppo తాజా ఫ్లాగ్‌షిప్ ఇమేజింగ్ అల్గారిథమ్‌లతో పాటు OnePlus ఫ్లాగ్‌షిప్‌లలో ఉపయోగించే ‘షాడోలెస్ క్యాప్చర్’ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేకమైన, స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్, “డ్యూయల్ ఐస్ కోర్ VC” కూలింగ్ సిస్టమ్, అద్భుతమైన ఇ-స్పోర్ట్స్ Wi-Fi G1 చిప్‌తో వస్తుందని OnePlus ఇప్పటికే ధృవీకరించింది.రెండు మోడళ్లకు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లు ఒకేలా ఉంటాయి. ఇటీవల ఈ రెండు ఫోన్‌లు MIIT అథారిటీ ఆఫ్ చైనా  డేటాబేస్‌లో కనిపించాయి.దీని కారణంగా వాటి అనేక స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి.

జాబితా ప్రకారం.. రెండు ఫోన్‌లు 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. ఇది 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. రెండూ 120 Hz రిఫ్రెష్ రేట్, ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటాయి. రెండూ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15లో రన్ అవుతాయి. రెండు మోడల్‌లు 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB, 16GB+1TB అనే ఐదు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ అవుతాయి.