Last Updated:

Samsung Galaxy S24 FE Price Drop: తోపు డీల్.. సామ్‌సంగ్ 5జీ ఫోన్‌పై రూ.13,568 డిస్కౌంట్.. పోతేరావ్ పక్కా..!

Samsung Galaxy S24 FE Price Drop: తోపు డీల్.. సామ్‌సంగ్ 5జీ ఫోన్‌పై రూ.13,568 డిస్కౌంట్.. పోతేరావ్ పక్కా..!

Samsung Galaxy S24 FE Price Drop: సామ్‌సంగ్ ప్రియులకు శుభవార్త. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉంది. Samsung Galaxy S24 FE 5G ఫోన్ టాప్-ఎండ్ 256GB వేరియంట్ ప్రస్తుతం దాని లాంచ్ ధర కంటే రూ.13,568 తక్కువగా ఉంది. ఫోన్ స్పెసిఫిక్ కలర్ వేరియంట్‌పై మాత్రమే ఇంత పెద్ద తగ్గింపు లభిస్తుంది. ధర తగ్గింపు తర్వాత, ఇప్పుడు చాలా మంది బడ్జెట్‌లో ఈ ఫోన్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత చౌకగా ఈ ఫోన్ ఎక్కడ దొరుకుతుంది? ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ర్యామ్, స్టోరేజ్ ప్రకారం రెండు వేర్వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. దాని 8GB + 128GB వేరియంట్ ధర రూ. 59,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 65,999. ఇది బ్లూ, గ్రాఫైట్, మింట్ కలర్స్‌లో విడుదలైంది. 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి ఇక్కడ చూద్దాం.

Samsung Galaxy S24 FE Offers
ఫోన్ 8GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మింట్ కలర్ వేరియంట్ అమెజాన్‌లో కేవలం రూ. 52,431 అంటే దాని లాంచ్ ధర కంటే రూ. 13,568 తక్కువకు అందుబాటులో ఉంది. అదే కలర్, స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60,999. అంటే లాంచ్ ధర కంటే కేవలం రూ. 5,000 తక్కువ. మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ నుండి కొనుగోలు చేస్తే మీకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

Samsung Galaxy S24 FE 5G Features
ఫోన్ డ్యూయల్ (నానో) SIM సపోర్ట్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD ప్లస్ (1080×2340 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 4nm deca-core Exynos 2400e చిప్‌సెట్‌తో ఉంటుంది. ఫోన్ రెండు డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో రిలీజ్ చేశారు. 128GB +256GB,  రెండూ స్టాండర్డ్ 8GB RAMని కలిగి ఉన్నాయి.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో OISతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్‌తో OISతో 8-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 10-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Galaxy AI ఫీచర్‌కి ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్ మోడ్, కంపోజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోన్ 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌లో అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఆప్షన్స్‌లో 5G, LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ డస్ట్, నీటి స్ప్లాష్‌ల నుండి రక్షించటానికి IP68 రేటింగ్‌తో వస్తుంది. భద్రత కోసం ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, సామ్‌సంగ్ నాక్స్ వాల్ట్ ఉన్నాయి.