Last Updated:

iPhone 16 Price Cut: ఊహించలేదు.. ఐఫోన్ 16పై ఆఫర్లే ఆఫర్లు.. ప్రైస్ భారీగా తగ్గింది..!

iPhone 16 Price Cut: ఊహించలేదు.. ఐఫోన్ 16పై ఆఫర్లే ఆఫర్లు.. ప్రైస్ భారీగా తగ్గింది..!

iPhone 16 Price Cut: టెక్ దిగ్గజం యాపిల్ తన iPhone 16 ధరను అకస్మాత్తుగా తగ్గించింది. మీరు ఇప్పుడు ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.17,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ అన్ని ఐఫోన్ 16 మోడళ్ల కొనుగోలుపై భారీ తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ ఐఫోన్ బేస్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఐఫోన్ 16ను మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, ఇందులో యాపిల్ A18 బయోనిక్ ప్రాసెసర్‌ ఉంది. ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంది. అలాగే 512GB స్టోరేజ్, 3561mAh బ్యాటరీ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

iPhone 16 Features
ఐఫోన్ 16 మొబైల్ 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది డైనమిక్ ఐలాండ్ స్క్రీన్. డిస్‌ప్లేసూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. దీని పీక్ బ్రైట్నెస్ 2,000 నిట్స్. డాల్బీ విజన్ సపోర్ట్‌ కూడా అందించారు. ఫోన్ యాపిల్ A18 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18తో పనిచేస్తుంది. ఈ ఐఫోన్‌లో మూడు స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 128GB, టాప్ వేరియంట్ 512GB స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంది.

కంపెనీ ఈ ఐఫోన్‌ను డ్యూయల్ కెమెరా సెటప్‌తో పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది ట్రూ టోన్ ఫ్లాష్‌తో వస్తుంది. దీనితో పాటు, 12 మెగాపిక్సెల్ 2X టెలిఫోటో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఐఫోన్ 12-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కూడా అందించారు. 6 3,561mAh కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్‌కి పరిచయం చేశారు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, USB టైప్-సి పోర్ట్ ఉంది. ఇది 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది.

iPhone 16 Offers
ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ఐఫోన్ 16 కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఐఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ రూ.72,900కి అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ని రూ.79,900 ధరకు విడుదల చేశారు. అలాగే, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.83,400కి తగ్గించారు. దీని లాంచ్ ధర రూ.89,900గా ఉంది. ప్రస్తుతం రూ. 6,500 తగ్గింది. 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,09,900గా ఉంది . ఇది రూ. 96,900కి జాబితా చేశారు.

ఐసిఐసిఐ, ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 4,000 అదనపు తగ్గింపును పొందచ్చు. దీంతో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.68,900కి తగ్గనుంది. ఈ తగ్గింపుతో మీరు ఐఫోన్ 16 256GB , 512GB మోడల్‌లను వరుసగా రూ.79,400కి పొందవచ్చు. ఫైనల్‌గా రూ. 92,900కి మీ సొంతం చేసుకోవచ్చు.