Published On:

iPhone 15 Discount Offers: ఆలోచించిన ఆశాభంగం.. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. చాలా తక్కువ ధరకు కొనండి..!

iPhone 15 Discount Offers: ఆలోచించిన ఆశాభంగం.. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. చాలా తక్కువ ధరకు కొనండి..!

iPhone 15 Discount Offers: యాపిల్ స్మార్ట్‌ఫోన్స్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. యువత ఎంతగానో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. వాటి ధరల విషయానికి వస్తే.. అన్ని స్మార్ట్‌ఫోన్లకంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో వస్తాయి. కంపెనీ ఇటీవలే 16 సిరీస్‌ను కూడా విడుదల చేసింది.

 

ఈ సిరీస్ ఫోన్లు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు మిడ్ రేంజ్ బడ్జెట్‌లో విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు ఐఫోన్ 16కి బదులుగా ఐఫోన్ 15ని కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ధరను భారీగా తగ్గించింది. దాదాపు రూ. 40 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

iPhone 15 Offers
ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో ఐఫోన్ 15 128 GB వేరియంట్‌పై 7 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడ iPhone 15 ధర రూ.69,900కి బదులుగా రూ.64,400గా ఉంది. దీని ధరపై మొత్తం రూ. 5500 ప్రత్యక్ష తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో ఐఫోన్ 15 ధరను మరింత తగ్గించవచ్చు.

 

iPhone 15 Bank Offers
మీరు iPhone 15పై భారీ డిస్కౌంట్ కోసం బ్యాంక్ ఆఫర్‌ను ఉపయోగించవచ్చు. కోటాక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు రూ. 3000 వరకు తగ్గింపును పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

 

iPhone 15 Exchange Offers
iPhone 15పై రూ. 41,150 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ని ఇచ్చి iPhone 15ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు రూ. 41,150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే దీనిపై ఎక్స్ఛేంజ్ తగ్గింపు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.