Home / YSRCP
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కు సంబంధించి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేవాలు గురువారం ప్రారంభమైన నేపధ్యంలో సభా నిర్వహణ పైన స్పీకర్ తమ్మినేని సీతారాం బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ (బీఏసీ) ఏర్పాటు చేసారు. ప్రభుత్వం నుంచి సీఎం జగన్ తో సహా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన, బీఏసీలో సభ్యులుగా ఉన్న మంత్రులు హాజరయ్యారు.
కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్ దండేకు స్థానం కల్పించారు.
కొడాలి నాని మాట్లాడే భాషలో తప్పులేదని ఆయన పై ఈగ వాలితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
చంద్రబాబు అభివృద్ధి చేయలేదు సరే, అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ఏం చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
పోలవరం పై చర్చించేందుకు టీడీపీ అధినేత ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోరారు. శాసనసభకు వస్తే టీడీపీ చేస్తున్న సవాళ్ల పై చర్చిద్దామని ఆయన అన్నారు.
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు
ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేక, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిజాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది