Home / twitter
ట్విట్టర్లో సిబ్బందిని సగానికి సగం తగ్గించడంతో ఉద్యోగుల్లో పని భారం భారీగా పెరిగిపోయింది. దీంతో మస్క్ మదిలో కొత్త ఐడియా వచ్చింది.
గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై పలు మార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ తాజాగా మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని నెట్టింట ప్రస్తావించారు. ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అన్న ట్రంప్.. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.
ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అలాంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది.
మరోసారి మస్క్ నెట్టింట వైరల్ గా మారారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే గనుక యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు.
యూఎస్ టెక్ దిగ్గజం HP సీఈవో ఎన్రిక్ లోరెస్ రాబోయే మూడేళ్లలో కంపెనీ తన శ్రామిక శక్తిని తగ్గించుకోనుందని మరియు 4,000 నుండి 6,000 మంది వ్యక్తులను తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. కాగా మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.
ట్విట్టర్ బ్లూ బర్డ్ లాగానే సేవలు అందిస్తుంది దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ'. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు తమవైపు ఆకర్షించే పనిలో పడింది.
ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు, నవంబర్ 21 వరకు కంపెనీ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడినందునట్విట్టర్ మునిగిపోయే నౌకగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ అనేక రకాల మార్పులు చేర్పులతో అటు ఉద్యోగులకు ఇటు యూజర్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్రమించాలని సుదీర్ఘ పనిగంటలు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ఉద్యోగులకు తెలిపారు.
మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.