Home / Rishi Sunak
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో వేడెక్కిన బ్రిటన్ రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైనారు. సునాక్ భారత దేశ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో బ్రిటన్ లోని భారత పౌరులు సంబరాల్లో మునిగిపోయారు
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కన్జర్వేటివ్ పార్టీలో వాతావరణం వేడెక్కింది. ఆ పార్టీకి చెందిన 100 ఎంపీల మద్ధతు తనకు ఉందంటూ భారత మూలాలకు చెందిన రుషి సునాక్ వెల్లడించారు.
బ్రిటన్ నూతన ప్రధానమంత్రి లిజ్ ట్రస్ మంత్రివర్గ కూర్పులో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో సేవలందించిన పలువురు సీనియర్లను పక్కనపెట్టారు. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను మైనార్టీ వర్గాలకు చెందిన ఎంపీలకు కట్టబెట్టారు.
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి మరియు కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై 81,326 ఓట్లతో విజయం సాధించారు.
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్ టాప్‌లో ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైతే, భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు.
బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునాక్ రాజీనామాతో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా పెరుగుతూపోయి 54 మంత్రుల రాజీనామా వరకు వెళ్లింది. దీతో బోరిస్ రాజీనామా అనివార్యమైంది. అయితే బోరిస్ స్థానంలో కొత్త ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైంది.