Last Updated:

Rishi Sunak: భారత్ మూలాలు.. విదేశాల్లో కీలక పదవులు

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌ టాప్‌లో ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైతే, భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్‌ నిలవనుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు.

Rishi Sunak: భారత్ మూలాలు.. విదేశాల్లో కీలక పదవులు

Prime9Special: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌ టాప్‌లో ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైతే, భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్‌ నిలవనుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో ఓసారి చూద్దాం.

కమలా హ్యారిస్‌ – అమెరికా ఉపాధ్యక్షురాలు: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారే.

ఆంటోనియా కోస్టా – పోర్చుగల్‌ ప్రధానమంత్రి: గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా. గోవాకు చెందినవారు.

మహమ్మద్‌ ఇర్ఫాన్‌ – గయానా అధ్యక్షుడు: ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

ప్రవింద్‌ జుగ్నాథ్‌ – మారిషస్‌ ప్రధానమంత్రి: మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్‌ జుగ్నాథ్‌ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.

పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ – మారిషస్‌ అధ్యక్షుడు: మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన, 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు. చంద్రికా ప్రసాద్‌ సంతోఖి, సురినామ్‌ అధ్యక్షుడు దక్షిణ అమెరికాలోని సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.

ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డ పై కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఐదు దేశాలే కాకుండా ట్రినిడాడ్‌ & టొబాగో, పోర్చుగల్‌, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి: