Home / Revanth Reddy
Ts Leaders: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నాయకులు నోటికి పదును పెడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునే క్రమంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. శాంతి భద్రతలు.. మత ఘర్షణలకు ఆజ్యం పోస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
Revanth Reddy: రాష్ట్రంలో పునర్ వైభవం సాధించడం కోసం కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే.. ఆ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఈ యాత్ర చేయనున్నారు. తెలంగాణలో తెరాస పాలన అంతమే లక్ష్యంగా ఈ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించారు.
Revanth Reddy: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పందించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్మితా సబర్వాల్ సంఘటన అద్దం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికే రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ‘ సీఎం కార్యదర్శి ప్రాణాలకే […]
Manik Rao Thackrey: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. గాంధీ భవన్ లో నేడు ఆయన టీపీసీసీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని అన్నారు. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. అధిష్ఠానం ఏం చెబితే అది చేయడమే తన […]
Revanth Reddy: హైదరాబాద్ లో జరుగుతున్న నిజాం అంత్యక్రియలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపడం ఏంటని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించడాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన చౌమహల్లా ప్యాలెస్ లో చివరి నిజాం పార్ధివదేహనికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం రాజులు సృష్టించిన సంపద హైదరాబాద్ కే తలమానికం అని ఆయన అన్నారు. చివరి నిజాం ముఖరం ఝా […]
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. అసలు రేవంత్ పాదయాత్ర చేస్తారా.. ఈ యాత్రకు సీనియర్లు సహకరిస్తారా అనే సందిగ్ధత కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కీలక పోస్టులన్నింటిని బీహార్ రాష్ట్రానికి చెందిన వారికే కట్టబెడుతున్నారని.. పదవుల కేటాయింపులో తెలుగువారు గుర్తుకు రావడం లేదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో సమస్యలను పరిష్కరించాలని భావించిన ఏఐసీపీ పార్టీ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ కు ఈ బాధ్యతలను అప్పగించింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.