Home / Prime Minister Modi
ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని నిజామాబాద్ లో పర్యటించనున్నారు. నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం.
నేడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఒంటిగంట 35 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు పాలమూరుకు చేరుకుంటారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ వాట్సాప్ చానల్ వారంలోపే 5 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. తన ఫాలోవర్లందరికీ కృతజ్జతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారం ప్రారంభించారు.మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిదాన్ సదన్ ( రాజ్యాంగ సభ) గా పిలవబడుతుందని చెప్పారు. పార్లమెంటు కొత్త భవనంలోకి మారేందుకు ముందుగా సెంట్రల్ హాల్లో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంయుక్త సమావేశం జరిగింది.
సెప్టెంబర్ 18-22 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తొమ్మిది అంశాలను జాబితా చేసిన సోనియా రాబోయే సెషన్లో వాటిపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రధానిని కోరారు.
పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.