Home / Political News
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నల్గొండ జిల్లా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేటాయిస్తూ జీవో 246 తెచ్చిందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ కాలేజీ చేపట్టనున్నారు . కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ అనుమతి కోసం ఈ నెల 23న అనుమతిని తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ 25 న నోటీసులు పంపించారు .
ఇతర పార్టీల నుంచి టికెట్ సాధించి మొత్తం 277 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని..వీరిని కొనడానికి బీజేపీ రూ.5,500 కోట్లరూపాయలు వెచ్చించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.బీజేపీ గుర్రాల కొనుగోలు, అమ్మకాల వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతికి సంబంధించి క్లబ్ యజమాని, డ్రగ్స్ వ్యాపారి సహా మరో ఇద్దరిని గోవా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్‌రూమ్‌లో డ్రగ్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ యొక్క స్వభావం ఇంకా ధృవీకరించబడలేదు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ డ్రగ్ ఏంటన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది. సభకు ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించడంపై బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు సభకు నిర్వహించుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు సభకు భారీ ఏర్పట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల, అతను రాబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు.
మద్యం టెండర్లపై కొత్తవాళ్లు రావడంతో ఆ జిల్లాలో మాములు ట్విస్టులు కాదు|Terachatu Rajakiyam
తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.