Home / Political News
2019లో ఓడిపోయిన 144 “కష్టమైన” లోక్సభ స్థానాల్లో మెజారిటీ గెలవాలని బీజేపీ అగ్రనేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డా మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక పార్టీ నాయకులతో సమావేశమయి ఈ మేరకు మేధోమథనం సెషన్లో సందేశాన్ని అందించారు.
టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించనున్నారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర దాదాపు 150 రోజుల్లో పూర్తి కానుంది.
లిక్కర్ స్కాం పై కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాన్ని బలహీన పరిచారని ఫైరయ్యారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, దాన్ని నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.
త్వరలో ఏపిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారును సాగనంపాల్సి ఉందని సమయం ఆసన్నమయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం నీతీష్ కుమార్తో కేసీఆర్ భేటీ అయ్యారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.