Last Updated:

BJP: 277మంది ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ రూ.5,500 కోట్లు ఖర్చు పెట్టింది.

ఇతర పార్టీల నుంచి టికెట్‌ సాధించి మొత్తం 277 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని..వీరిని కొనడానికి బీజేపీ రూ.5,500 కోట్లరూపాయలు వెచ్చించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.బీజేపీ గుర్రాల కొనుగోలు, అమ్మకాల వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

BJP: 277మంది ఎమ్మెల్యేలను కొనడానికి  బీజేపీ రూ.5,500 కోట్లు ఖర్చు పెట్టింది.

National News: ఇతర పార్టీల నుంచి టికెట్‌ సాధించి మొత్తం 277 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని..వీరిని కొనడానికి బీజేపీ రూ.5,500 కోట్లరూపాయలు వెచ్చించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.బీజేపీ గుర్రాల కొనుగోలు, అమ్మకాల వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఎందుకంటే వారు సామాన్యుల సొమ్ముతో శాసనసభ్యులను కొన్నారు. ఆ ఎమ్మెల్యేలను కొనేందుకు ఇప్పుడు సామాన్యుల నుంచి డబ్బులు తీసుకోవడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా దేశంలోని సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ కొనసాగుతోంది. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించిన బీజేపీ, దృష్టి జార్ఖండ్‌పై పడింది. ఇప్పుడు మళ్లీ వారి కళ్లు ఢిల్లీపై పడ్డాయి. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పెద్ద కుట్ర పన్నారని కేజ్రీవాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి: