Home / Political News
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో తేదేపాకు పూర్వ వైభవం తీసుకరావడమే ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగనుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. వీరు ఇంట్లో నుండి బయటకు రావడం లేదు.
గన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్ కల్యాణ్. ఏంటా కొత్త నినాదం. అది పవన్‌కు వర్కవుట్ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.
మునుగోడు ఊపులో ‘ముందస్తు' ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని సమాచారం. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామనని వ్యాఖ్యానించారు. యువత తమ భవిష్యత్తు కోసం నన్ను నమ్మంది నాపై నమ్మకం ఉంచండి అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం రోడ్డే వెయ్యని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తుందంటూ ఆయన అధికార వైసీపీపై మండిపడ్డాడు.
తెలంగాణ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
దేశ ప్రధాని రాష్ట్రానికి, అందునా అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్న వేళ. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. అయితే, మోదీతో పోరుకు సై అంటున్న కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏకాంత భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ సాగరతీరాన జరిగిన ఈ సమావేశం, ఏపీలో అనేక రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉందా? పవన్‌ను పిలిపించుకొని మరీ ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం? ఈ భేటీతో పవన్ ఇమేజిని మోదీ అమాంతం పెంచేశారా?
ఏపీ మంత్రి ఆర్కే రోజా కాసేపట్లో ప్రారంభించనున్న గ్రామ సచివాలయ భవనానికి వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తాళం వేయడం సంచలనం కలిగించింది.