Home / Pawan Kalyan
Prabhas in Pawan kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో లీనమయ్యారు. అయితే ఆయన అభిమానులు మాత్రం తిరిగి సినిమాలో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాల ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందనున్న ఉస్తాద్ భగత్ […]
AP Deputy CM Pawan Kalyan tweet about mgr: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 17తో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ స్థాపించిన ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంజీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పురచ్చి తలైవర్’ ఎంజీఆర్‌పై […]
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది.ప్రదోష కాలాన వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
గొప్పవిజయానికి పిఠాపురం నుంచే బీజం పడిందని.. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని సందర్శించిన పవన్.. అనంతరం వారాహి సభలో పాల్గొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడగునా.. అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేరింతల మధ్య.. పవన్ కొండగట్టుకు చేరుకుని.. అంజన్నను దర్శించుకున్నారు
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ అన్నారు. పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ వెళ్తారని ఆయన అన్నారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26 నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ సమయంలో పవన్ పాలు, పండ్లు మరియు ద్రవాలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.
కాపు ఉద్యమ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది