Home / Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
రాజమండ్రి జైలు సాక్షిగా...జనసేన, టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే..ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖ చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న పవన్ అక్కడనుంచి అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.ఈ సందర్బంగా ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లను అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.
ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు .ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు .
ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.