Home / Pawan Kalyan
ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు .ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు .
ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.
వైసీపీ ఓటమి..కూటమి విజయం ఖాయమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వారాహి విజయ భేరి సభలో సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడని తెలిపారు.
గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కోవడానికి కొత్త పథకం వేసిందని విమర్శించారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ధ్వజమెత్తారు.
:వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వారాహి విజయ భేరి సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని పవన్ చెప్పారు.
జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు.
చంద్రబాబు అధికారం అనే ఆకలితో అలమటిస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 1978లో. చంద్రబాబు ఇంటి పెంకులు కూడా వేయించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఈ సంపాదన ఎలా సాధ్యపడింది..?మాకు కూడా చెప్తే రాజకీయాలు వదిలేసి మేము కూడా సంపాదించుకుంటామని ముద్రగడ అన్నారు.
కోనసీమలో కొబ్బరి బొండం లో ఎంత తీపిగా ఉంటుందో రాజోలు నా జీవితంలో అంతటిది .రాష్ట్రము అంతా ఓడిపోయినా రాజోలు లో గెలిచి ఒక చిన్న వెలుగు నింపిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ..ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజోలు లో పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చీకటిలో వెలుగు లాగా రాజోలు జనసేనకు విజయం అందించింది .
మేము ఓడితే నాకు కానీ చంద్ర బాబు కు ఏమి కాదు .కాని రైతులు,కార్మికులు ,విద్యార్థులు దెబ్బతింటారు .ఇది చూస్తూ నేను ఉరుకోలేను .అందుకే కూటమి కట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ-జనసేన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల లో జ్యూట్ మిల్లు ను తెరిపిస్తామని చెప్పారు..