Home / Parliament
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం ముగియడంతో పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు 'తిరంగా మార్చ్' చేపట్టారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వమే పార్లమెంట్‌ను నడపనివ్వడం లేదు.. అదానీ స్కాంపై ఎందుకు చర్చకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వలపై పార్లమెంట్ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వచేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. […]
లండన్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.ఆర్థిక బిల్లును ఆమోదించాలనే లక్ష్యంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభమయ్యాయి.
President: రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము.. తొలిసారిగా తన ప్రసంగాన్ని పార్లమెంట్ లో వినిపించారు. పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దీంతో ద్రౌపది ముర్ము.. తన తొలి ప్రసంగాన్ని పార్లమెంట్ సాక్షిగా వినిపించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా పలు బిల్లులు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఉభయ సభల్లో ఉపయోగించకూడని పదాల జాబితాను విడుదల చేసారు. పార్లమెంట్ లో ఇకపై జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ వ్యాప్తి' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాలను ఉపయోగించడం మరియు 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి' వంటి పదాలను ఉపయోగించకూడదు.