Last Updated:

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యలపై రచ్చ

లండన్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.ఆర్థిక బిల్లును ఆమోదించాలనే లక్ష్యంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభమయ్యాయి.

Parliament  Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యలపై రచ్చ

Parliament Budget Session:లండన్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.ఆర్థిక బిల్లును ఆమోదించాలనే లక్ష్యంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభమయ్యాయి.

రాహుల్ లండన్ లో దేశాన్ని అవమానించారు..(Parliament Budget Session)

ముందుగారక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్‌లో భారతదేశాన్ని అవమానించారని, అతని ప్రకటనలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలని నేను కోరుతున్నాను. అతను ముందు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. రాహుల్ గాంధీ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరారని, దీనిని నిర్ద్వంద్వంగా ఖండించాలని సింగ్ అన్నారు. రక్షణ మంత్రి డిమాండ్‌కు అధికార కూటమి సభ్యులు మద్దతు పలికారు.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులు తొలగించబడినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? కేంద్ర మంత్రివర్గం సక్రమంగా ఆమోదించిన ఆర్డినెన్స్ (రాహుల్ గాంధీచే) చింపివేయబడినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు మాట్లాడుతుండగా, ప్రతిపక్ష నేతలు సభా వెల్‌లోకి వచ్చారు.రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో లోక్ సభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు, కేంద్రం కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వెలుపల ప్రతిపక్ష నాయకులు నిరసన చేపట్టారు.

16 ప్రతిపక్ష పార్టీల సమావేశం..

అంతకుముందు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్షనేతల సమావేశం జరిగింది. దాదాపు 16 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని అన్నారు..లోక్‌సభలో కాంగ్రెస్‌ విప్‌ మాణికం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని తమ పార్టీ కోరుకుంటోందని అన్నారు. “మేము ప్రజల సమస్యలను లేవనెత్తుతాము – ధరల పెరుగుదల, ఎల్పీజీధర, అదానీ, ఏజెన్సీల దుర్వినియోగం, రైతుల సమస్యలు, గవర్నర్ల జోక్యం వంటి అంశాలపై ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలన్నారు.

సోమవారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 కోసం రెండవ బ్యాచ్ గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లను సమర్పించనున్నారు. 2023-24 సంవత్సరానికి గాను జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌ను కూడా ఆమె లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31న ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 6న ముగిసే అవకాశం ఉంది.