Home / national news
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతాపార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలు అందాయి. మరోవైపు కాంగ్రెస్ కు రూ.95.46 కోట్లు మాత్రమే విరాళాలు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.43 లక్షలు విరాళంగా అందుకోగా, కేరళలో సీపీఎం రూ.10.05 కోట్ల నిధులు పొందింది.
మీకు శీతాకాలం అంటే ఇష్టమా. చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడానికి మన భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడి విశేషాలేంటో ఓ లుక్కెయ్యండి.
బెంగళూరులో విద్యార్థులు మొబైల్ ఫోన్లను తరగతి గదులకు తీసుకెళ్లడాన్ని అరికట్టేందుకు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అందరినీ షాక్ కు గురిచేసాయి.
ఫైనాన్స్ అకౌంటెంట్ (ఎఫ్ఎ) రిక్రూట్మెంట్ స్కామ్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) జమ్ము కశ్మీర్లో దాడులు నిర్వహిస్తోంది.
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
కర్నాటక మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై బయోపిక్ తీసేందుకు రంగం సిద్దమైంది. టైటిల్ రోల్ లో నటించేందుకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని చిత్ర మేకర్స్ సంప్రదించినట్టు సమాచారం.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది,
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వదోదర నగర శివార్లలోని ఒక తయారీ యూనిట్‌పై దాడి చేసి దాదాపు రూ. 500 కోట్ల విలువైన నిషేధిత ఎండి డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది.
కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
భారతీయ రైల్వే శాఖ భారీగా ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు వాటిని గమనించాలని సూచించింది.