Home / national news
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం లక్నో-బహ్రాయిచ్ హైవేపై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్ జోడో యాత్ర ’ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్ జోడో’గా అభివర్ణించారు.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన 20 ఫైళ్లను కేంద్రం సుప్రీంకోర్టు కొలీజియంకు తిరిగి పంపింది.
గ్యాంగ్స్టర్-ఉగ్రవాదం లింకుల కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్సిఆర్, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్లోని 20 ప్రదేశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దాడులు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రస్తుతం పాటియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే.
కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా టీకా వల్ల సంభవించిన మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని వివరించింది.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాధ్ జిల్లాలో ఉన్న ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం నిఖా అనగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చెయ్యడం, పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టడాన్ని నేరంగా పరిగణిస్తూ వాటిపై నిషేధం విధించారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ వరుసగా ఆరవ రోజు కూడా పనిచేయలేదు.