Last Updated:

Viral Video: వికారాబాద్ జిల్లాలో వింత శకటం

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగానే ఈ శకటం ఉండడంతో స్ధానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: వికారాబాద్ జిల్లాలో వింత శకటం

Vikarabad : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగానే ఈ శకటం ఉండడంతో స్ధానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడిందోనని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు.

ఉన్నట్టుండి ఓ తెల్లటి వస్తువు ఆకాశంలో నుంచి పంటపొలాల్లో పడినట్లు ప్రజలకు కనిపించింది. ఇది వెయ్యి కేజీల బరువున్న హీలియం బెలూన్ గా సైంటిస్టులు చెబుతున్నారు. ఏలియన్ షిప్ అంటూ మరో ప్రచారం జరుగుతోంది. అది వెదర్ రీసెర్చ్ బెలూన్ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దాన్ని గ్రామస్తులు వింతగా చూస్తూ.. ఎక్కడి నుంచి వచ్చిపడిందో.. ఏంటోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ సంఘటన స్థలానికి బయల్దేరారు.

ఇవి కూడా చదవండి: