Home / national news
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇటీవల కాలంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.
ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది.
రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా సాగుతోంది. రాహుల్ వెంట పలువురు నటీనటులు వ్యాపారవేతలు ఇలా అనేక మంది నడక సాగిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో రాహుల్ వెంట ఈ యాత్రలో పాల్గొన్నందుకు ఓ స్కూల్ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
భారత నావికాదళంలో దాదాపు 3,000 మంది అగ్నివీరులు చేరుకున్నారని, వారిలో 341 మంది మహిళలు ఉన్నారని నేవీ శనివారం తెలిపింది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటానికి అని కోర్టు పేర్కొంది.
కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది.
ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వేళకు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది.
వచ్చే నెలలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరయ్యే ఉత్తరప్రదేశ్ బృందానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం వహిస్తారు. దీనితో ఈ ఫోరమ్‌కు హాజరవుతున్న తొలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి రికార్డులకెక్కనున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.