Home / Munugode By Poll
ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
కష్టాలు ఎవరికి ఊరికే రావు మీ విలువైన ఓటును అమ్ముకుంటనే వస్తాయంటూ ' ఓ ఫోటోను పట్టుకొని మరీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది.
విచ్చల విడిగా డబ్బులను ఖర్చు పెడుతున్న ప్రధాన పార్టీలు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథ రావునుసస్పెండ్ చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ కు పోలీసులు చెక్ పెట్టారు. 400కోట్లతో నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసేందుకు వేసిన పెద్ద ప్లాన్ ను పోలీసులు బెడిసికొట్టేలా చేశారు.
ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ.పాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ సవాలు విసిరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చావో చెప్పాకే మునుగోడుకు రండి. నేను మునుగోడు లోనే ఉన్నా, దమ్ముంటే మునుగోడులో బహిరంగ చర్చకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ కేఏపాల్ సవాలు విసిరారు.
ఏపీలో అన్న జగన్ మోహన్‌రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల.
మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల్లో అలజడి రేపుతుంది. ప్రధానంగా నగదు పంపిణీ, లోపాయికారి హామీలు, విచ్చల విడి మద్యం పంపిణీ అంశాలు మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. అధికార దాహంతో ఒకరైతే, అధికారం కోసం మరొకరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.