Home / Munugode By Poll
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రే స్వయంగా మద్యం పోశారు. మరోవైపు ప్రధాన పార్టీలు నోట్ల కట్టలను నీళ్లలా పంచారు. దీంతో ఖరీదైన ఉప ఎన్నికగా తెలంగాణాలో మునుగోడు రికార్డుకెక్కింది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల తీరు. రేపటిదినం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ క్రమంలో పోలింగ్ రౌండ్లను ఓవర్ లెక్కన బుకీలు పంచుకొన్నారు.
రేపటిదినం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు భారీ పోలీసు బందోబస్తును కల్పించిన్నట్లు రాచకొండ సీపి మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
వంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడటం చర్చనీయాంశమైంది.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయల విలువలు దిగజారాయి. ప్రత్యర్దుల పై మాటలు తూటాలు సాగడం ఒక ఎత్తైతే, ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయాలను అపహస్యం చేస్తున్నారు. తాజాగా భాజపా అధ్యక్షులు బండి సంజయ్ రాజీనామా చేసిన్నట్లు సృష్టించిన ఓ ఫోర్జరీ లేఖ నెట్టింట వైరల్ అయింది.
తెలంగాణలో అందరిదృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది.
మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై పలివెల గ్రామంలో జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ఓ పథకం ప్రకారం ఈటల పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైనారు.