Last Updated:

Munugode By Poll: మునుగోడు ఎన్నిక మహిమ.. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడ్డాయి..

వంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ  నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడటం చర్చనీయాంశమైంది.

Munugode By Poll: మునుగోడు ఎన్నిక మహిమ.. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడ్డాయి..

Munugode: నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ  నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడటం చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ఉద్యోగులకు మాత్రం అలాంటి తీపి కబురు చెప్పే ఫోన్ సందేశాలేవీ రాలేదు. ప్రభుత్వం ఉప ఎన్నికలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు పొందేందుకు ఒకటో తేదీన వేతనాలు అందజేసిందని మిగతా వారంతా చర్చించుకుంటున్నారు.

మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ బ్యాంకు అకౌంట్‌లలో శాలరీలు క్రెడిట్ అయినట్లు సెల్‌ఫోన్లలో మెసేజ్‌లు రావడంతో ఈ రెండు జిల్లాల్లోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. వేతనాలు ఏ రోజు వేస్తారో, అని ఎదురుచూస్తున్న వారికి ఒకటో తేదీనే ఖాతాల్లో పడిపోవడంతో, ఉద్యోగులంతా ఒకటో తారీఖు వేతనాలు రాక ఎన్నేళ్లు అయిందోనని చర్చించుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల ఉద్యోగులకు జీతాలతో పాటు పెండింగ్​ బిల్స్​ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

2018 ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ ఫస్ట్​ తారీఖున జీతాలు రావట్లేదు. జిల్లాల పేర్లలోని మొదటి అక్షరం ప్రకారం విడతలవారీగా 20 తారీఖు వరకు ప్రభుత్వం ఆలస్యంగా జీతాలు వేస్తూ వస్తున్నది. దీంతో ‘వై’ అక్షరం ఉన్న యాదాద్రి జిల్లాకు పది నుంచి 17వ తారీఖు మధ్య జీతాలు పడేవి. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు మొదటిసారి ఫస్ట్​ తారీఖున యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లోని 11 వేల మంది ఎంప్లాయ్స్​కు జీతాలు పడ్డాయి. జీతాలు పడ్డట్టుగా మెసేజ్ ​రావడంతో ఉద్యోగులు ​ఆశ్చర్యపోయారు. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో మొత్తం 49 మండలాలు ఉండగా, వాటిలోని ఏడు మండలాల (మునుగోడు పరిధిలోని) ఎంప్లాయ్స్​కు మాత్రమే పెండింగ్​ బిల్స్​ రాగా, మిగిలిన 42 మండలాల వాళ్లకు రాలేదు.