Home / Mumbai
దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి 'ప్లాన్ 2047' అనే బుక్లెట్ను స్వాధీనం చేసుకుంది. పిఎఫ్ఐ మరియు దాని 'దేశ వ్యతిరేక' కార్యకలాపాల పై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా ఈ దాడి జరిగింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల బృందం ముంబైలోని నవ సేవా పోర్ట్ నుండి హెరాయిన్ పూసిన 20 టన్నుల కంటే ఎక్కువ లైకోరైస్ను కలిగి ఉన్న కంటైనర్ను స్వాధీనం చేసుకుంది.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే 'అధిష్' బంగ్లా నిర్మాణం అక్రమమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. రెండు వారాల్లోగా బంగ్లా నిర్మాణాన్ని కూల్చివేయాలని పరిపాలనను హైకోర్టు ఆదేశించింది.
పాఠశాల లిఫ్ట్ లోపల కాలు, బయట శరీరం ఇరుక్కుని ఒక ఉపాధ్యాయురాలు మరణించింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో జరిగింది.
ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ వివనాలను వెల్లడించింది.
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేక్ అప్ లు కామన్. కానీ అవి కాస్త ముదిరితే కొన్ని విభేదాలకు తావిస్తాయి. కాగా తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటిపై ఫిట్నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో చోటుచేసుకుంది.
ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి గాను గత నెల 28న పరీక్షలు నిర్వహించగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నేడు ఫలితాలను విడుదల చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.