Home / Mahesh Babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు.
మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి కాలంచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న మహేశ్ బాబు తల్లి ఇవాళ తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్లు వైరల్ అయిన విషయం విదితమే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ టైటిల్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
సూపర్‌స్టార్ మహేష్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో కొత్త ప్రయోగానికి సిద్దామయ్యారనే చెప్పుకోవాలి.మహేష్ బాబు ఆయన అభిమానులు ఒక్కటే కాదు తెలుగు సినీ అభిమానులందరు ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. మహేష్ గతేడాది నుంచి టీవీ ప్రమోషన్స్‌లో కూడా ఉన్నాడు. అతను ఇటీవల జీ తెలుగుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు మరియు అతనికి 9 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.
కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ది ఘోస్ట్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది మరియు దసరా సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్‌కి నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో లీడర్ 2 సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతోంది. ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్‌ని సమీప భవిష్యత్తులో లీడర్ 2 చేసే అవకాశం గురించి అడిగినపుడు ఆమె స్పందించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు సందర్బంగా . అతని ఆల్-టైమ్ సూపర్ హిట్ చిత్రం పోకిరి మళ్లీ రిలీజ్ అయింది. 9వ తేదీ సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా 375 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించబడ్డాయి. ఈ చిత్రం 1.73 కోట్ల రూపాయల భారీ వసూళ్లను వసూలు చేసింది.