Home / Maharashtra
భాజపా, ఏకనాధ్ షిండేల సంకీర్ణంతో ఏర్పడిన మహారాష్ట్ర సర్కారు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాశ్చాత్య భాషకు చరమగీతం పాడుతూ హలో అనే మాటకు బదులుగా వందేమాతరం అంటూ అభినందించాలంటూ కొత్త చట్టం తెచ్చింది
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నిజమైన శివసేనను నిర్ణయించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాగపూర్ అర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ నేతలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరదపవార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి జోడో యాత్ర ప్రయోజనంగా మారుతుందని తెలిపారు.
వేదాంత లిమిటెడ్ మరియు తైవాన్ సెమీకండక్టర్ దిగ్గజం ఫాక్స్‌కాన్ గుజరాత్లో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి $19.5 బిలియన్ (రూ.1.54 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి.
ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.
1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధిని సుందరీకరించడం పై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఆగస్టు 26 నుంచి 75 ఏళ్లు పైబడిన వారు తమ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉచిత ప్రయాణానికి వారు తమ టిక్కెట్లను ఆగస్టు 26లోపు బుక్ చేసుకున్నట్లయితే ఛార్జీల వాపసు పొందుతారు, 65 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎంపికచేసిన బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలపై 50 శాతం రాయితీని పొందుతారు
మహారాష్ట్రలో ఉగ్రవాదులు మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ముంబై నుంచి రాయ్‌ఘడ్ వెళ్లే మార్గంలో ఉన్న హరిహరేశ్వర్ బీచ్‌లో అనుమానాస్పద బోట్లను పోలీసులు గుర్తించారు. రెండు బోట్లలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి లభ్యమైంది.
జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు నవాబ్ మాలిక్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ డైరక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖకు చెందిన ముంబై జిల్లా కుల ధృవీకరణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఆయన ఈ చర్య తీసుకున్నారు.