Home / Maharashtra
ఆధారాలు లేకుండా భర్తను తాగుబోతు, వ్యభిచారి అని పిలవడం క్రూరత్వమని బాంబే హైకోర్టుపేర్కొంది. పూణేకు చెందిన జంట వివాహాన్ని రద్దు చేస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది.
డిజిటల్ డిటాక్స్.అనేది స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించకుండా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా దూరంగా ఉండే కాలం. ఇపుడు మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని కడేగావ్ తహశీల్ లో మోహితే వడ్గావ్ అనే గ్రామంలో దీనిని పాటిస్తున్నారు. ఈ గ్రామ జనాభా సుమారుగా 3000 వరకు ఉంటుంది. గ్రామంలో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు గ్రామంలోని ప్రతి ఇంట్లో టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు పూర్తిగా మూసి ఉంటాయి.
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. భూ తగాదాలు వస్తూ ఉండటం వల్ల ఆ సందర్భంలో మహారాష్ట్ర. ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. ఇంత గౌరవం అక్కడ కోతులకు దక్కింది.
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఒక కోడి పెట్టిన 210 గ్రాముల గుడ్డు భారతదేశంలో అతిపెద్ద గుడ్డుగా జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి ఉంది.
ఈ పటాకులను చూస్తే మాత్రం కాల్చకుండా అమాంతం నోట్లో వేసుకుంటాం. అదేంటి టపాసులను నోట్లో వేసుకోవచ్చు అంటున్నారు.. పటాకులు విషపూరితం కదా అనుకుంటున్నారు కదా.. కాదండీ ఈ టపాసులు మాత్రం తియ్యతియ్యగా నోటిలో వేస్తే కరిగిపోతాయి. మరి వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..
మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరే వర్గానికి ఎన్నికల కమీషన్ పార్టీ పేరు, గుర్తును కేటాయించింది. తనకు కేటాయించిన కాగడాతో అన్యాయాన్ని, మోసాన్ని తగలబెడుతామని ఉద్ధవ్ ప్రకటించారు.