Home / lok Sabha
బుధవారం లోక్‌సభలో కలర్ స్మోక్ ప్రయోగించి పోలీసుల చేతికి చిక్కిన నిందితులను సాగర్ శర్మ , మనోరంజన్ గా గుర్తించారు. వీరిలో సాగర్ శర్మ తీసుకున్న విజిటర్ పాస్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుమీద జారీ అయినట్లు తెలుస్తోంది. మైసూరుకు చెందిన మనోరంజన్ వృత్తిరీత్యా ఇంజనీర్ .
లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న వేళభద్రతా వైఫల్యం బయటపడింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు ఆగంతకులు టియర్ గ్యాస్ లీక్ చేశారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనతో ఎంపీలు భయంతో పరుగులు తీశారు.
'క్యాష్ ఫర్ క్వరీ' కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తన బహిష్కరణ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
టిఎంసి ఎంపి మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఎంపిగా ఉన్న మహువా మొయిత్రా తన పాస్వర్డ్, లాగిన్ ఐడిని ఇతరులకిచ్చారని నిర్థారించారు.
లోక్‌సభ సోమవారం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2023ని వాయిస్ ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఆగస్టు 3న లోక్‌సభలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. వ్యక్తుల డిజిటల్ డేటాను దుర్వినియోగం చేసినందుకు లేదా రక్షించడంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకు జరిమానాను ప్రతిపాదిస్తూ, భారతీయ పౌరుల గోప్యతను కాపాడేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.
మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు చర్చ జరగనుంది.ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న సమాధానం ఇవ్వనున్నారు.జూలై 26న ప్రతిపక్ష పార్టీల తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఎల్ఐసీ నుంచి అదానీ గ్రూప్ లోని ఏయో సంస్థలు ఎంత రుణాలు తీసుకున్నాయనే వివరాలు కూడా మంత్రి తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
క్రిప్టోకరెన్సీపై లోకసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. కాగా వీసీకె ఎంపీ తిరుమావాలవన్ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి స్పందిస్తూ, క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఉభయ సభల్లో ఉపయోగించకూడని పదాల జాబితాను విడుదల చేసారు. పార్లమెంట్ లో ఇకపై జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ వ్యాప్తి' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాలను ఉపయోగించడం మరియు 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి' వంటి పదాలను ఉపయోగించకూడదు.