Home / latest political news
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న
2024లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్)గా పోటీ చేస్తానని వైకాపా సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో పర్యటన చేయనున్నారు. అయితే ఈ పర్యటన కోసం స్థానికంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఇప్పటికే స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సర్కారు పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు. కాగా ఇప్పుడు తాజాగా పవన్ కు మద్దతుగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ తో 57 మండీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమం లోనే పొత్తుల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వైకాపా నేతలు చెబుతుండగా.. ప్రతిపక్షం లోని తెదేపా, జనసేన పార్టీలు వారి వారి శైలిలో ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నారు.
జనసేన అధినేత నేడు తిరుపతికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అందుకు గాను ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు.
ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తిరుపతి జిల్లాలో జనసైనికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్‌కు మద్దతుగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు..