Home / latest national news
ఎనిమిది వేల కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో డక్కన్ క్రానికల్ సంస్థకి చెందిన 14 ఆస్తులని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని ఆస్తులని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కెనరా, ఐడిబిఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. నేటి ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70వేల మందికి ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించారు.
: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీల కోసం ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపారు
మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినందుకు ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లను సస్పెండ్ చేశారు. కాక్‌పిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించిన ఒక నెల తర్వాత ఇది జరిగింది.
: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి
బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను మూసివేస్తామని భారతదేశం బెదిరించిందని పేర్కొన్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై కేంద్రం ఎదురుదాడి చేసింది. 2021లో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సే, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలను, రైతుల నిరసనలపై నివేదించే వారి ఖాతాలను సెన్సార్ చేయమని, అలాగే ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తామని భారతదేశం నుండి బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.
బిపర్ జోయ్ తుఫాను దృష్ట్యా గుజరాత్‌లోని సౌరాష్ట్ర మరియు కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ ( ఐఎండి) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 15 సాయంత్రానికి బిపర్ జోయ్ తుఫాను జఖౌ పోర్ట్ ప్రాంతాన్ని దాటే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. నామినేషన్ సెంటర్ల వద్ద సెక్షన్ 144 సెక్షన్ విధించాలని అధికారులను ఆదేశించింది.
: బైక్-టాక్సీ అగ్రిగేటర్లు రాపిడో మరియు ఉబర్లను దేశ రాజధానిలో ఆపరేట్ చేయడానికి తప్పనిసరిగా అనుమతించాలన్న హైకోర్టు ఆదేశాలపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త విధానాన్ని రూపొందించే వరకు వారిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.