Home / latest national news
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.
పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.
అమృత్సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగాపాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం భారత విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్‌కు ఉత్తరాన ప్రవేశించి రాత్రి 8:01 గంటలకు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని ఆదివారం 10% పెంచింది, దీనితో రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు మరియు 88 పైసలు పెరిగాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను పొడిగించింది.
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్‌లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు
బీహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటపెట్టిందని అధికారులు తెలిపారు. 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.5 కోట్ల నగదు, రూ.11 కోట్ల ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.