Home / latest national news
ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ ( సీఆర్ఎస్ ) నివేదిక తేల్చి చెప్పిందని తెలుస్తోంది. దీనితో ఈ ప్రమాదం వెనుకు ఎటువంటి కుట్ర లేదని స్పష్టమయింది.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున దుబాయ్ లో తాను మూడు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. కేజ్రీవాల్ కు రాసిన ఒక లేఖలో అతను ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఎవరి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందేహంతో పలువురి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం. ఇకపోతే ఓ రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోంది.
ఇకనుంచి బీహార్ లో జరిగే ప్రతీ వివాహం పోలీసులకు ముందే తెలుస్తుంది. ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలకు సంబంధించి సమాచారాన్ని స్దానిక పోలీసులకు తెలియజేయాలని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ సింగ్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. అన్ని పార్టీల నుండి ఉత్పాదక చర్చలు జరగాలని ఆయన ట్విట్టర్లో కోరారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలు మరియు సాక్షులకు ట్యూటర్ని అందించిన ఆరోపణలకు సంబంధించి వెంటనే లొంగిపోవాలని సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ హైకోర్టు శనివారం ఆదేశించింది.
మహిళలు సెక్స్ కు తమ అంగీకారాన్ని తెలిపే వయస్సును 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల యువకుడిపై దాఖలయిన ఎఫ్ఐాఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.