Home / latest national news
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గుజరాత్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశించడంపై అధికార బిజెపి పార్టీతో జెడి (ఎస్) మరియు కాంగ్రెస్‌లు వాగ్వాదానికి దిగాయి. నందిని బ్రాండ్ పేరుతో రాష్ట్రంలో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు ప్రతిపక్ష రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు తమిళనాడు పార్టీ నేతలు దిండిగల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ దిండిగల్ జిల్లా అధ్యక్షుడు మణికందన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.
: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది.అధికార డీఎంకే కార్యకర్తలు శనివారం చెన్నై వీధుల్లో #DictatorRavi మరియు #GetOutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌లతో గవర్నర్ వ్యతిరేక పోస్టర్లు వేశారు
: బైసాఖీ వేడుకల సందర్భంగా, ఏప్రిల్ 9 నుంచి 18 వరకు పాకిస్థాన్‌లో జరగనున్న వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన సిక్కు యాత్రికులకు న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ 2,856 వీసాలను జారీ చేసింది.
: రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
అక్రమ డ్రగ్స్ మరియు ఆయుధ వ్యాపార రాకెట్‌పై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చెన్నైలోని అనుమానితులకు చెందిన పలు ప్రదేశాలలో దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.
హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనకు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది.
హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా నేడు గుజరాత్లో పర్యటించారు.
ఆక్స్‌ఫామ్ ఇండియా మరియు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR) కార్యాలయాలపై విదేశీ సహకార నియంత్రణ చట్టం ఉల్లంఘనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు కేంద్రం గురువారం ఆదేశించింది.