Home / latest national news
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకుమందు అధికార కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా తాను మంగళవారం ఒక రోజు నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. వసుంధర రాజే నేతృత్వంలోని గత బిజెపి ప్రభుత్వం చేసిన అవినీతికి వ్యతిరేకంగా గెహ్లాట్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర రైతులకు మద్దతుగా నందిని పాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. గుజరాత్‌కు చెందిన డెయిరీ దిగ్గజం అమూల్‌కు బెంగళూరు డెయిరీ ప్రొడక్ట్‌లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో బీజేపీ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు జెడి(ఎస్) మాటల యుద్ధానికి దిగాయి.
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఖాకీ ప్యాంటు, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి కనిపించారు. నల్లటి టోపీ ధరించి బైనాక్యులర్స్ చేతబట్టి టైగర్ రిజర్వ్ ను పరిశీలించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి పులుల అభయారణ్యాలలో ఒకటిగా ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన మొదటి ప్రధాని ఆయన.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గుజరాత్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశించడంపై అధికార బిజెపి పార్టీతో జెడి (ఎస్) మరియు కాంగ్రెస్‌లు వాగ్వాదానికి దిగాయి. నందిని బ్రాండ్ పేరుతో రాష్ట్రంలో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు ప్రతిపక్ష రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు తమిళనాడు పార్టీ నేతలు దిండిగల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ దిండిగల్ జిల్లా అధ్యక్షుడు మణికందన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.
: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది.అధికార డీఎంకే కార్యకర్తలు శనివారం చెన్నై వీధుల్లో #DictatorRavi మరియు #GetOutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌లతో గవర్నర్ వ్యతిరేక పోస్టర్లు వేశారు
: బైసాఖీ వేడుకల సందర్భంగా, ఏప్రిల్ 9 నుంచి 18 వరకు పాకిస్థాన్‌లో జరగనున్న వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన సిక్కు యాత్రికులకు న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ 2,856 వీసాలను జారీ చేసింది.
: రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
అక్రమ డ్రగ్స్ మరియు ఆయుధ వ్యాపార రాకెట్‌పై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చెన్నైలోని అనుమానితులకు చెందిన పలు ప్రదేశాలలో దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.
హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనకు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.