Home / latest national news
రాష్ట్ర అసెంబ్లీఆమోదించిన బిల్లులను రాష్ట్ర గవర్నర్లు ఆమోదించేందుకు గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది
ఖలిస్థాన్ అనుకూల సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పంజాబ్ పోలీసులు మరియు దాని కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో పాపల్‌ప్రీత్ సింగ్‌ను పట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఒక ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన కారణంగా ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానం సోమవారం ప్రయాణించిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఎయిరిండియా విమానం ఉదయం 6.35 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది.
అకోలా జిల్లాలో బాలాపూర్ తహసీల్ లోని పరాస్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం స్థానికంగా ఉన్న ఆలయంలో మహాభారతి నిర్వహించారు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) ద్వారా నియమించబడిన చాలా మంది అధికారులు బందిపోట్లని కేంద్ర మంత్రి బిశేశ్వర్ తుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.కోడి దొంగకు శిక్ష పడుతుందని, మినరల్ మాఫియాను నడుపుతున్న అధికారిని ముట్టుకోలేమని, వ్యవస్థ అతన్ని కాపాడుతుందని ఆయన ఆరోపించారు.
టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సోమవారం మైనర్ బాలుడి పెదవులపై ముద్దుపెట్టి, 'నాలుకను చప్పరించమని కోరుతున్నట్లు చూపించే వీడియో కలకలం రేపడంతో క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్ల నుండి తీవ్ర ప్రతిస్పందనను రేకెత్తించింది.
చత్తీస్‌గఢ్ ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా బస్తర్‌లో తాను జీవించి ఉన్నంత వరకు మద్య నిషేధం ఉండదని అన్నారు. ఒక వైరల్ వీడియోలో, అతను బస్తర్‌లో మద్యపాన అలవాటును సమర్ధించారు.బస్తర్‌లో మద్యపాన నిషేధాన్ని నేను ఎప్పటికీ అనుమతించను. అతిగా తాగడం వల్ల చనిపోవచ్చు. కాని ఇది ఔషధం లాంటిది సరైన నిష్పత్తిలో తీసుకోవాలని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలోని ఒక జైలులో 44 మంది పురుష ఖైదీలు మరియు ఒక మహిళా ఖైదీ హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) బారిన పడ్డారు. సామూహిక పరీక్షల సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు, అక్కడ రామ్ లాలా ఆలయంలో ప్రార్థనలు చేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా దాదాపు 3,000 మంది శివసైనికులు, మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రితో కలిసి పర్యటనలో ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనలో "స్పూర్తిదాయకమైన" బిజెపి కార్యకర్తతో "ప్రత్యేక సెల్ఫీ" తీసుకున్నారు. అతని లాంటి వ్యక్తులను కలిగి ఉన్న పార్టీలో భాగమైనందుకు తన గర్వాన్ని వ్యక్తం చేశారు.ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో, ప్రధాన మంత్రి ఎస్. మణికందన్‌తో తీసిన చిత్రాలను పంచుకున్నారు మరియు దానిని “ప్రత్యేక సెల్ఫీ” అని పేర్కొన్నారు.