UPSC Exam: యూపీఎస్సీ ఫలితాల్లో గందరగోళం.. ఇద్దరు అభ్యర్ధులకు ఒకే నెంబర్.. ఒకే ర్యాంక్
UPSC Exam: ఈ పరీక్షకు ఎంపికై.. చివర్లో అడ్డంకి ఏర్పడితే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు మహిళా అభ్యర్థులకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.
UPSC Exam: సివిల్స్ సాధించడం కొందరికి ఏళ్ల కల. దానికోసం సంవత్సరాల పాటు.. రాత్రింబవళ్లు కష్టపడతారు. లక్ష్య ఛేదనలో నిద్రలేని రాత్రులు గడుపుతారు. కాని ఎంపిక జాబితాలో వారి పేరు చూడగానే వారు పడ్డ కష్టం మెుత్తం మర్చిపోతారు. ఈ పరీక్షకు ఎంపికై.. చివర్లో అడ్డంకి ఏర్పడితే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు మహిళా అభ్యర్థులకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.
ఏమైందంటే? (UPSC Exam)
సివిల్స్ సాధించడం కొందరికి ఏళ్ల కల. దానికోసం సంవత్సరాల పాటు.. రాత్రింబవళ్లు కష్టపడతారు. లక్ష్య ఛేదనలో నిద్రలేని రాత్రులు గడుపుతారు. కాని ఎంపిక జాబితాలో వారి పేరు చూడగానే వారు పడ్డ కష్టం మెుత్తం మర్చిపోతారు. ఈ పరీక్షకు ఎంపికై.. చివర్లో అడ్డంకి ఏర్పడితే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు మహిళా అభ్యర్థులకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.
మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరమ్మాయిల పరిస్థితి ఇపుడు గందరగోళంగా మారింది. వారిద్దరికి ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ వచ్చింది. చివరికి ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరి మెుదటి పేరు కూడా ఒకటి కావడమే. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన.. అయాషా ఫాతిమా, అలీరాజ్ పూర్ జిల్లాకు చెంది అయాషా మక్రానీ ఇద్దరు సివిల్స్ రాశారు.
ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఇద్దరికి ఒకే విధంగా 184 ర్యాంకు వచ్చింది. దీనిపై ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సివిల్స్ కోసం.. రెండు సంవత్సరాలు కష్టపడి చదివానని అయాషా మక్రానీ వాపోయారు. ఈ ఫిర్యాదుపై అయాషా ఫాతిమా స్పందించారు.
ఇద్దరికి ఒకే రోల్ నెంబర్ ఉందని తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పారు. అధికారులు ఎలాంటి మోసం జరగకుండా చూస్తారని అనుకుంటున్నానని ఆమె అన్నారు..
యూపీఎస్సీ ఏమన్నదంటే?
వారిద్దరి అడ్మిట్ కార్డుల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. మక్రానీ కార్డ్ పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25, 2023 గురువారం రోజు పేర్కొనబడింది.
ఫాతిమా కార్డులో కూడా అదే తేదీని ఉంది. కానీ అందులో ఆ రోజు మంగళవారంగా పేర్కొనబడింది. నిజానికి క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం.
చివరకు అయాషా ఫాతిమా సరైన అభ్యర్థి అని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి. పొరపాటు ఎలా జరిగిందో విచారిస్తామని అన్నారు.