Home / Kishan Reddy
తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఈ రెండింటి పేర్లతో భాజపా, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయ్. ప్రజలు ఓట్లు మాకంటే మాకంటూ ఇరు పార్టీలు విమోచన దినోత్సవం, వజ్రోత్సవాలను తమ స్వార్ధానికి వినియోగించుకొంటున్నారు.
చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అంతకుమించి మరీ అసభ్య పదజాలాలు ఇది నేటి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఉచ్ఛరిస్తున్న మాటలు. శాసనసభ హుందాతనాన్ని మరిచి మరీ రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూనే పొరుగు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకొనింది.
చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.