Home / Kishan Reddy
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే..అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి. కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
మునుగోడు ఉపఎన్నికలో భాజపా నైతికంగా విజయం సాధించిందని, అయితే ప్రలోభాలు, బెదిరింపులతో ఓటమిని చూడాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి మోదీ అండ్ టీం పై ఆరోపణలు గుప్పిస్తూ ఎమ్మెల్యేల కొనుగోల ప్రలోభాల డీల్ కేసుపై సీఎం కేసిఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
సీఎం కేసీఆర్ చండూరు సభలో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికల సభలో ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కు అపనమ్మకం అభద్రతా భావం పెరిగాయని నిరాశ, నిస్పృహతో ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన విమర్శించారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారన్నారు.
అవినీతి కుటుంబ పాలనకు నవంబర్ 3న మునుగోడు ప్రజలు మీటర్లు తో లెక్క తేల్చనున్నారని పెట్టనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపధ్యంలో భాజపా అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
తెలంగాణకు వచ్చి తిడుతున్నారు. ఢిల్లీలో అవార్డులిస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును చూపిస్తున్నారు. అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి ఆయన వెళ్లారు. ఇటీవలే ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందారు. కాగా వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.