Home / Kerala
కేరళ కొల్లాం జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు తమ ఇన్నర్వేర్లను తొలగించమని బాలికలను కోరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి చెందిన ముగ్గురు, కాలేజీకి చెందిన ఇద్దరు ఉన్నారు.
కేరళలోని కొల్లాంలో ఆదివారం జరిగిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ముందు తన కుమార్తె బ్రాను తొలగించమని ఒత్తిడి చేసారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పరీక్షా కేంద్రమైన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వద్ద భద్రతా తనిఖీల్లో మెటల్ హుక్స్ బీప్ కావడంతో బాలికను తన బ్రాను తొలగించమని అడిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మొదటి కేసు కేరళలో వెలుగు చూడగా.. రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగు చూసినట్లు రాష్ర్ట వైద్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఈ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి
ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన
ఇటీవల విదేశాల నుండి కేరళ కు తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ లక్షణాలను ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుందని ఆమె తెలిపారు. ఆ వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించాయని, విదేశాల్లో ఉన్న మంకీపాక్స్ రోగితో సన్నిహితంగా ఉన్నారని జార్జ్ చెప్పారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.