Home / International News
ప్రముఖ అంతర్జాతీయ సంస్ధ ఫిలిప్స్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సంఖ్యలో 5శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఆ కంపెనీ సీఈఓ రాయ్ జాకోబ్స్ పేర్కొన్నారు. దీంతో 4వేల మందిని తొలగించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
సరికొత్త ఫ్యూచర్లతో వస్తోన్న కొంగొత్త టెక్నాలజీ వస్తువులు మనుషులను పలు విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ పాలిట యాపిల్ వాచ్ దైవంగా మారింది. కట్టుకున్న భర్త చేతిలో మృతిచెందకుండా ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆమెను కాపాడింది.
ఓ హోటల్‌పై ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది అమాయకులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన సోమాలియాలో జరిగింది.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కన్జర్వేటివ్ పార్టీలో వాతావరణం వేడెక్కింది. ఆ పార్టీకి చెందిన 100 ఎంపీల మద్ధతు తనకు ఉందంటూ భారత మూలాలకు చెందిన రుషి సునాక్ వెల్లడించారు.
ఆ దేశంలో స్మగ్లింగ్ కార్యకలాపాలకు జంతువులే కీలకం. రెండు దేశాల సరిహద్దులో స్మగ్లింగ్ కీలకంగా మారిన ఆ మూగ జంతువులను కోర్టులో ప్రవేశపెట్టిన సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకొనింది.
షీజిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో తెలిపారు.
బ్రిటన్ ప్రధానిగా లిజ్‌ట్రస్ 45 రోజులే పదవిలో ఉన్నారు. కానీ ఆమెకు జీవితాంతం ఏడాదికి (1,15,000 పౌండ్లు) కోటిరూపాయల చొప్పున భత్యం అందనుంది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.
ఆధిపత్య దుర్వినియోగం చేస్తున్న అభియోగం మీద గూగుల్‌కు 1,337.76 కోట్ల జరిమానాను కాపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని కొన్ని మార్కెట్లలో దుర్వినియోగం చేసినందుకు ఐసీసీ ఈ జరిమానా విధించింది.
అమెరికా ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో ఈ అతిపెద్ద కెమెరాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు.