Home / IND vs AUS
IND vs AUS Test: నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓ దశలో రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించేలా కనిపించినా.. చివరికి బ్యాటర్లు రాణించండంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. మెుదట్లో వికెట్లు కోల్పోయిన భారత్.. చివర్లో పట్టుదలతో రాణించింది. చివర్లో జడేజా, అక్షర్ బ్యాటింగ్ తో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.
నాగపూర్ వేదికగా టీమిండియా , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నతొలి టెస్టులో మొదటి రోజే భారత బౌలర్లు చెలరేగి పోయారు.
IND vs AUS 1st Test : నాగ్ పూర్ వేదికగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్.. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో వీళ్ల పేర్లు టాప్ లో ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు ఈ ఇద్దరి పేర్ల మీదుగానే బోర్డర్ గవాస్కర్ […]
క్రికెట్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి. ఈ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగుతుంటే..
టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లైన బుమ్రా, జడేజాలతో పాటు స్టాండ్ బై ప్రేయర్గా ఉన్న దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరో స్టార్ ప్లేయర్ అయిన రిషభ్ పంత్ కు గాయమైనట్టు తెలుస్తోంది.
టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.
ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ ఉచిత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అవకాశం టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో చోటుచేసుకొన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్రీడాభిమానులకు మాత్రమే.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్ల తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్కి వేదికగా నిలవడం వల్ల టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్లను గురువారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు జరుపుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పేర్కొనడంతో.. సికింద్రాబాద్లోని జిమ్ఖానా మైదానానికి బుధవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు.