Home / Hyderabad
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా మహేష్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభారు ప్రిన్స్. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్‌తో చేతులు కలిపిన మహేష్ నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు భూమి పూజ చేశారు.
బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్ల బావి పూర్వవైభవం సంతరించుకుంటోంది. 17వ శతాబ్దం నాటి కట్టడం పునరుద్ధరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చెత్తా చెదారంతో నిండిన బావిని శుభ్రపర్చడంతోపాటు సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’వాలింది. ఒకరోజంతా అక్కడే సేదతీరి.. తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్‌పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం.
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దక్షిభారతం అందులోనూ తెలంగాణ ఆంధ్రా మధ్య కూడా ఓ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు.