Che Guevara: చే గువేరా కుమార్తె ఎవరు? ఆమె హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు?
ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్ట్ యోధుడు, లాటిన్ అమెరికా విప్లవకారుల్లో అగ్రభాగాన నిలిచే క్యూబా మాజీ మంత్రి ఎర్నెస్టో చే గువేరా గురించి అందరికీ తెలిసిందే. చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు.
Che Guevara: ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్ట్ యోధుడు, లాటిన్ అమెరికా విప్లవకారుల్లో అగ్రభాగాన నిలిచే క్యూబా మాజీ మంత్రి ఎర్నెస్టో చే గువేరా గురించి అందరికీ తెలిసిందే. చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే సభలో వారు పాల్గొననున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబాకు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల మద్దతు కూడగట్టడంలో భాగంగా వారు హైదరాబాద్ కి వస్తున్నారు.
హైదరాబాద్లో జరుగనున్న ఆ సభ విశేషమేంటంటే..
ఈ నెల 22న రవీంద్ర భారతిలో జరిగే సభలో వారు పాల్గొంటారని బాలమల్లేశ్ చెప్పారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో గురువారం బాలమల్లేశ్ అధ్యక్షతన నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా సన్నాహక సమావేశం జరిగింది. చేగువేరా కుమార్తె, మనుమరాలికి ఘనంగా స్వాగతం పలకాలని సమావేశంలో నిర్ణయించారు. రవీంద్రభారతిలో జరిగే సభకు అన్ని రాజకీయ పార్టీల (బీజేపీ, ఎంఐఎం మినహా)ను ఆహ్వానించాలని నిర్ణయించారు.
చే గువేరా భారతదేశం వచ్చింది అప్పుడే..
ఎర్నెస్టో చే గువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించారు.
చే గువేరా(Che Guevara) లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల్లో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవాల్లో పాలుపంచుకున్నారు.
మార్క్సిస్ట్ విప్లవకారుడు గానే కాదు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, సైనిక వ్యూహకర్త, సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ప్రముఖ వ్యక్తి గానూ చే పాపులరయ్యారు. ఆయన 1959లో జూన్ 30 వే తేదీన చే.. తొలిసారి భారతదేశం వచ్చారు. ఆ రాత్రి పొద్దు పోయాక ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగారు. మర్నాడు నాటి ప్రధాని నెహ్రూ తన అధికార నివాసం తీన్‌మూర్తి భవన్‌లో చేగువేరాను సాదరంగా ఆహ్వానించారు.
వలస పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఆఫ్రో–ఏషియన్ దేశాలన్నీ బాండుంగ్‌లో సమావేశమై.. సమైక్యంగా ఉండాలని, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. అందుకే చేగువేరా ఇండియా వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారు. కలకత్తా కూడా సందర్శించారు. 39 ఏళ్ల వయసులో 1967 అక్టోబర్ 9న మరణించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/