Home / heavy rains
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు ఘజియాబాద్‌తో సహా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో బుధవారం ఉదయం మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. దీనితో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ
Weather Alert: ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు నైరుతి మేఘాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనం.. ఈ మూడు కలిసి తెలుగు రాష్ట్రాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఎడతెరపిలేని జోరువానతో తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దయ్యాయి.
భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి పలు చోట్ల ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి.
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో జులై 17,18,19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు మరియు వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తప్పిపోయినట్లు శనివారం ప్రభుత్వం తెలిపింది
Delhi Rains: ఉత్తరభారతాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగాయి. వేల మంది ప్రజలు నిరాశ్రయలు అయ్యారు. వంద మంది ఈ వరదల వల్ల ప్రాణాల విడిచారు. కాగా మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడిస్తుంది.