Home / heavy rains
ఉత్తరప్రదేశ్లో గత మూడు రోజుల్లో వర్షాల కారణంగా కనీసం 34 మంది మరణించారు. గత 24 గంటల్లో పది మరణాలు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 34 మందిలో పిడుగుపాటుకు 17 మంది, మునిగిపోవడం వల్ల 12 మంది, భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.
Himachal Pradesh Rains: ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులు కురుస్తున్న అతి భారీ వర్షాలకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.జూన్ 25 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్తాన్ అంతటా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో యాభై మరణాలు నమోదయ్యాయి.
జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా బల్తాల్ మరియు పహల్గాం మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బ్రేక్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలోనే ఈరోజు కూడా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే రీతిలో రుతుపవన ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండడంతో ఉత్తరాంధ్రలో
రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 12 జిల్లాల్లో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా నేటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది,
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సోన్ ప్రయాగ్ నుంచి బయల్దేరిన భక్తులు ఆగిపోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్జాయ్’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఈ తుపాను తీరం వైపు కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల